సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగవైకుంఠం తిరుమల లో శ్రీ వారి భక్తులకు టీటీడీ (TTD) అధికారులు నేటి, బుధవారం రాత్రి నుండి స్వామివారి సర్వదర్శనం టోకెన్ల జారినీ పునరుద్దరించనున్నారు. రధసప్తమి వేడుకల నేపథ్యంలో ఈ నెల 3వ తేదీ నుంచి ఎస్డి టోకెన్స్ జారినీ టీటీడీ అధికారులు నిలిపివేసిన విషయం తెలిసిందే. రధసప్తమి వేడుకలు వైభవంగా ముగియడంతో భక్తుల రద్దీ తగ్గనుంది.దీనితో తిరిగి నేటి బుధవారం రాత్రి 10 గంటల నుంచి భక్తులకు టోకెన్స్ను ఇవ్వనున్నారు. అలాగే స్వామి వారి అన్ని సేవలు యధాతధంగా జరుగనున్నాయి.
