సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్‌ ఎట్టకేలకు తమినాడు సమీపంలోని పుదుచ్చేరి సమీపంలో తీరం దాటిందని వాతావరణ విభాగం ప్రకటించింది. . అయితే పశ్చిమ దిశగా నెమ్మదిగా కదులుతూ రానున్న 6 గంటలలో బలహీనపడి తీవ్ర వాయుగుండంగా తుపాన్ మారనుందని తెలిపింది.ఈ నేపథ్యంలో నేడు, ఆదివారం, రేపటి సోమవారం దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో వర్షాలు ఇంకా కొనసాగే అవకాశముందని వివరించింది. నేడు, ఆదివారం భీమవరంతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వర్షపు జల్లులతో పాటు సెంట్రల్లీ ఎయిర్ కండిషన్ తరహాలో శీతల చలిగాలులు వీస్తూనే ఉన్నాయ్.చేపలు, రొయ్యల చెరువులలో ఆక్సిజెన్ సమస్యలు ఏర్పడి పంట నష్టపోతున్నామని ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే కోతకు వచ్చిన వరి పొలాలకు పెద్దగా ఇబ్బంది లేదు.. ..రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తా జిల్లాలు కాకినాడ, కోనసీమ జిల్లాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని చెప్పింది. ఇక నెల్లూరు, రాయలసీమ లో పలు చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *