సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: సీఎం చంద్రబాబు తుపాను నేపథ్యంలో నేడు, మంగళవారం అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను ప్రభావిత ప్రాంతాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు, కార్యకర్తలంతా ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. తుపాన్ కారణంగా నేడు, రేపు బుధవారం అప్రమత్తంగా ఉండి ప్రజలకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. మంత్రి కొల్లు రవీంద్ర తీరా ప్రాంతలలో క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తూ ప్రజలకు తుపాన్ రక్షిత షెల్టర్లు కు వెళ్లాలని సూచనలు ఇస్తున్నారు. గతంలో ఎవరూ చేయని విధంగా తీరా ప్రాంత ప్రజలకు బియ్యంతో పాటు ప్రజలకు 3000 రూపాయల ఆర్థిక సాయం కూడా అందజేస్తున్నాం అని ప్రకటించారు. మంత్రి నారా లోకేష్ సిఎంఓ నుంచి రాష్ట్రవ్యాప్తంగా తుఫాన్ ప్రభావతి ప్రాంతాలను పరిశీలిస్తూ అక్కడి నుంచే ఆయా జిల్లాలకు సూచనలు చేస్తున్నారు.
