సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో తుఫాన్ ప్రభావంతో భీమవరం నియోజకవర్గంలోని వీరవాసరంమండలం లో తోలేరు పరిసర ప్రాంతాలలో సుడి గాలులు భయానక వాతావరణం సృష్టించడం.. పొలాలలో పంటలు చెల్లాచెదురు కాగా, చెట్లు, భారీ స్థాయిలో కరెంట్ స్తంబాలు విరిగి పడిన నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ రాత్రి వర్షంలో వెళ్లి వీరవాసరం నష్టపోయిన బాధితులను పరామర్శించి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అయితే వీరవాసరం లో పూర్తీ నష్టాన్ని అంచనా వెయ్యడానికి నేటి బుధవారం ఉదయం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మరో మరు వీరవాసరం మండలంలో పలు గ్రామాలలో దారుణంగా దెబ్బ తిన్న వరి చేలను పరిశీలించి, రైతులతో మీడియా తో మాట్లాడుతూ.. ఇక్కడ 6 రకాల ధాన్యపు పంటలు పండిస్తున్నారని, 160 రోజులలో పంట చేతికొస్తుందని ఇప్పటికి 90 శాతం పండేసిందని ఇంకో 10 లేక 15 రోజులలో పంట చేతికొస్తుందనగా ఇలా తుపాను కబళించడం రైతులకు తీవ్ర నిరాశ కలిగిస్తుందని.. అయితే దాదాపు అందరికి పంట ఇన్సూరెన్స్ వస్తుందని బయపడవల్సిన అవసరం లేదని .. అయినప్పటికీ ఈ సార్వా పంట ను వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ విత్తనాలు చెల్లించినవారు ఇప్పటికే పంట కోసేశారని .. ఇక ముందు అందరు అధికారుల సూచనలు పాటించాలని సూచించారు. జగన్ సర్కార్ హయం లో వ్యవసాయం పండుగ అని, పడిపోయిన చెట్లను తొలగిస్తున్నామని, భారీగా కూలిన కరెంట్ స్తంబాలు నిలబెట్టి త్వరితంగా విద్యుత్ ను పునరుద్ధరిస్తామన్నారు.
