సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మహాశివరాత్రి వేడుకలు ముగిసాయి. చలి ‘శివ శివ’ అంటూ వెళ్ళిపోతుందని పెద్దల నానుడి. అయితే .ఉదయం రాత్రి కూడా గోదావరి జిల్లాలు ఉత్తరాంద్ర లో ఇంకా పొగమంచు కనపడుతుంది.మధ్యాహ్నం ఎండలు మండటం మొదలెట్టాయి. అయితే విచిత్రంగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడుతుందని శాస్త్రవేత్తలు అంచనావేస్తున్నారు. ఇది శ్రీలంక వైపు కదులుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నెల 21న ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అంచనా వేస్తున్నారు. అయితే వీటి ప్రభావంతో ఏపీలో ఈ నెల 21 , 22, 23 తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అంతేకాదు రాష్ట్రంలో ఎండల తీవ్రత కూడా పెరిగింది.. అటు పొగమంచు కొనసాగుతోంది.
