సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం తెనాలిలో జరగవలసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన రద్దు అయ్యింది. పవన్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. నేటి సాయంత్రం తెనాలిలో ర్యాలీ, సభల్లో ఆయన పాల్గొనాల్సి ఉంది. నిన్న,మంగళవారం రోజు పిఠాపురంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎండలో పవన్ పాదయాత్ర చేశారు. నిజానికి నాలుగు రోజుల క్రితమే అంటే పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్న సమయంలోనే పవన్ అస్వస్థతకు గురయ్యారని, అందుకే ఒకరోజు విరామం తీసుకొన్నారని తెలుస్తోంది..నిన్న నిర్వహించిన పాదయాత్ర తో అయన జ్వరం మరింత పెరిగిందని ఇక వైద్యుల సూచన మేరకు తన పర్యటనను రద్దు చేసుకున్నారు. తెనాలి పర్యటన ఫై మళ్లీ తేదీ, సమయం ప్రకటిస్తామని జనసేన నేతలు ప్రకటించారు.
