సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్రంలో భారీ వర్షాలకు జన జీవితాలు స్తంభించగా, విజయవాడ అమరావతి గుంటూరు,బాపట్ల జిల్లాలో కృష్ణ నది , బుడమేరు. వాగులు వంకలు పొంగి పొరలి పట్టణాలలోకి నీరు చేరటంతో భారీ అష్టి నష్టం, జన నష్టం.. జరిగింది. ఇప్పటికే ఇబ్రహీం పట్నం జలమయం అయ్యింది. మరో రోకలి పోటులా నేడు, సోమవారం ప్రకాశం బ్యారేజ్ ను భారీ స్టీమర్ 40 కిమీ వేగంగా వచ్చి ఢీ కొనటంతో బ్యారేజ్ గేటు ల వద్ద విద్వంసం జరిగింది. వరద తాకిడికి గేట్లు వీగిపోతే పరిస్థితి ఏమిటి? ఎటు నుండి వరద ప్రమాదం ముంచుకొస్తుందో చెప్పలేని పరిస్థితులలో ప్రజలు భయం భయంగా బ్రతుకుతున్నారు. సీఎం చంద్రబాబు స్వయంగా పర్యవేక్షణ చేస్తున్నప్పటికీ వరద బాధితుల నుండి చాల పిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం అధికారులపై కూడా సీరియస్ అవుతున్నారు.ఈనేపథ్యంలో నేడు, మంత్రి నిమ్మల రామానాయుడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. . అమరావతిపై దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని చెప్పారు. అమరావతిపై విషం చిమ్మడం వైసీపీకి మొదట్నుంచీ అలవాటేనని విమర్శలు చేశారు.రాజధాని అమరావతికి ఎలాంటి ప్రమాదం లేదని అన్నారు. . ప్రకాశం బ్యారేజీకి 4 బోట్లు కొట్టుకురావడం వెనుక వైసీపీ కుట్ర ఉండొచ్చుని అన్నారు. ఇది జగన్ ప్రభుత్వ పాలనా వైఫల్యమని చెప్పారు. బుడమేరును 35 వేల క్యుసిక్‎లకు పెంచాలని టీడీపీ హయాంలో నిర్ణయించామని తెలిపారు. కేవలం 25 వేల క్యుసిక్ వరద నీరు వస్తే శాంతినగర్ వద్ద 3 చోట్ల బ్రీఛ్ అయ్యిందని తెలిపారు. వరద ప్రభావం లేని జిల్లాల మంత్రులకు ఇక్కడ బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. హైదరాబాద్, చైన్నె చిన్న వర్షానికి మునిగి పోతున్నాయన్నారు. ప్రకాశం బ్యారేజి విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. ఫ్లడ్ తగ్గితే గేట్ క్లోజ్ చేయడానికి ఇబ్బంది లేదని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *