సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేటి శుక్రవారం ఉదయం భీమవరం మండలం లోని తుందుర్రు గ్రామానికి వెళ్ళిన రాష్ట్ర శాసన మండలి చైర్మన్, కొయ్యే మోషేను రాజు మరియు వారి కుమారుడు కొయ్యే సుందర్ రాజు, గన్నాబత్తుల నాగేశ్వర రావు, గన్నాబత్తుల శ్రీనివాస్ తదితరులు పుత్ర శోకంతో తీవ్ర విషాదంలో ఉన్న కోయ నగేష్ బాబు (కాంట్రాక్టర్) గృహానికి వెళ్లి వారి కుటుంబీకులను పరామర్శించి వారి ప్రగాఢ సానుభూతి తెలిపారు. నిన్న సాయంత్రం తాడేరు వద్ద ఆర్టీసీ బస్సు డీ కొట్టిన దుర్ఘటనలో తుందుర్రు గ్రామానికి చెందిన కోయ రాజేంద్ర రామ్ (20) మరణించారు. ఈ నేపథ్యంలో అక్కడ తీవ్ర విషాదం నెలకొంది.
