సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గ్రామాలను పచ్చని వాతావరణంలో సుందరీకరణతో అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం మండలం తుందుర్రు గ్రామంలో సుమారు రూ కోటి 42 లక్షలతో పలు అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. సుమారు రూ కోటి ఒక లక్షతో నిర్మించిన 60 వేల లీటర్ల ఆలమ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను, రూ 16 లక్షలతో రెండు సీసీ రోడ్లను ప్రారంభించారు. రూ 25 లక్షలతో హిందూ శ్మశాన వాటిక నిర్మాణం, శ్మశాన వాటిక ప్రహరీ గోడ నిర్మాణంకు శంకుస్థాపనలు వారు చేశారు. గ్రామాలను అభివృద్ధితోపాటు ఎంతో సుందరీకరణ చేస్తున్నామని అన్నారు. అతి సామాన్యుడికి కూడా వైద్యం అందించేలా ఈ ప్రాంతంలో వైద్యులను ఏర్పాటు చేస్తామని అన్నారు. వీరవాసరం, భీమవరంలోని 48 గ్రామాల్లోనూ శ్మశాన వాటికలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. అనంతరం కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, ఎమ్మెల్యే అంజిబాబు లను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నేత మెంట్ పార్ధసారధి తో పాటు గ్రామస్తులు, కూటమి నాయకులు అభిమానులు పాల్గొన్నారు.
