సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: 2013 తుని లో రైలు దహనం కేసులో టీడీపీ ప్రభుత్వ హయాంలో 40 కి పైగా ప్రముఖ కాపు నేతలపై కేసులు పెడితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారిపై కేసులు తొలగించిన నేపథ్యంలో మరోసారి ఆ కేసును తిరగదోడాలని ప్రస్తుత కూటమి ప్రభుత్వం హైకోర్టు లో ప్రభుత్వ అధికారులతో అప్పీల్ కు వెళ్లాలని జీవో ఇచ్చి 24 గంటలు కూడా గడవక ముందే ఏపీ సర్కార్ వెనక్కి తగ్గినట్లు చంద్రబాబు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. (ఇంత కీలకమైన కేసు కాబినెట్ ఆమోదం లేకుండా అధికారులే ఎలా జీవో ఇస్తారు?) నిజానికి తుని రైలు దహనం కేసు రీ ఓపెన్ చెయ్యడం అంటే ‘తేనెతుట్ట’ ను కదిపినట్లే.. గతంలోకాపులను B C లలో చేరుస్తానని హామీ నెరవేర్చని సంఘటనను మరోసారి గుర్తు చెయ్యడమే కాకుండా, ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని పోలీసులు కొట్టి ఆడువారిని బూతులు తిట్టి అవమానించి ఘటనలు దానిపై కాపులు గోదావరి జిల్లాలో చంద్రబాబు ప్రభుత్వం ఫై తీవ్ర స్థాయిలో ఉద్యమించిన ఘటనలు అన్ని మరల గుర్తు చేసారు. అయితే తుని కేసును తిరగదోడాలని ప్రభుత్వ నిర్ణయం 70 ఏళ్ళు ఫై బడిన వృద్ధుడు వైసీపీ నేత ముద్రగడ కంటే.. జనసేనలో కీలక పదవులలో ఉన్న నేతల ‘భవిషత్తు’ కు తుని కేసులు మరోసారి కు పెద్ద గుదిబండలుగా మారే అవకాశం స్వష్టంగా ఉంది. ఏడాది క్రితం ఎన్నికలలో 18 శాతం కాపుల ఓట్లు ఏకపక్షంగా కూటమి అభ్యర్థుల గెలుపుకు పెద్ద కారణం అయ్యాయి. దీనితో జనసేన, వైసీపీలో ఉన్న కాపు నేతలతో సహా రాజకీయాలకు అతీతంగా నిన్న ఉదయం నుండి జిల్లాల వారీగా కాపు సంఘాలు సమావేశాలతో అలర్ట్ అయ్యాయి. దానితో..రాజకియ లక్ష్యం ఏదైనా? ఇక ఎక్కువ గోకకూడదని జరిగిన నష్టం చాలని కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గింది.
