సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గతంలో కాపు నాడు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కాపులను బీసీల్లో చేర్చాలంటూ,అప్పటి చంద్రబాబు సర్కార్ కాపులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని 2016 జనవరి 31న బహిరంగ సభ నిర్వహించారు. ఆ సమయంలో అటుగా వస్తున్న రైలును కొందరు ఆగంతుకులు దహనం చేశారు. ఆ కేసుకు సంబంధించి గత వైసీపీ ప్రభుత్వం లో జగన్ అధికారంలోకి వచ్చాక ఈ కేసుకు సంబంధించి రైల్వే పోలీసులు సరైన ఆధారాలు సమర్పించలేదని పేర్కొంటూ 2023 మే 1న రైల్వే కోర్టు ఈ కేసు కొట్టివేసింది, ఇదిలా ఉండగా తాజగా ఏపీలో చంద్రబాబు సీఎం గా కూటమి ప్రభుత్వం తుని రైలు దహనం కేసు ఫై మరోసారి హైకోర్టు కు అప్పీల్ (Appeal)కు వెళ్ళుతుండటం సంచలనమ్ రేపుతోంది. రైలు దహనం రైలు బోగీలకు నిప్పు పెట్టడంతో ప్రోద్భలం ఉందంటూ ముద్రగడ తో సహా పలువురు కీలక కాపు నేతలపై గతంలో కేసులు నమోదయ్యాయి. దానిపై కాపు నేతలను,వారి కుటుంబాలను,మహిళలను వేదించవద్దు అని దాసరి నారాయణ రావు, చిరంజీవి సైతం తీవ్ర అభ్యన్తరం వ్యక్తం చేసారు. అయితే దీనిపై మరోసారి చంద్రబాబు సర్కార్ హైకోర్టులో తాజగా అప్పీల్ చేయాలని పీపీని ఆదేశించడం సంచలనం రేపుతోంది. వైసీపీ తో పాటు జనసేనలలో ప్రస్తుతం ఉన్న కాపు నేతలకు కూడా ఇది ఇబ్బందికర పరిణామం గా విశ్లేషకులు భావిస్తున్నారు.
