సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా చలిగాలులతో కూడిన వర్షాలు చెదురుమదురుగా కురుస్తూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయవ్యంగా పయనించి నేడు, మంగళవారానికి దక్షిణ బంగాళాఖాతంలో ప్రవేశించి తీవ్ర వాయుగుండంగా బలపడనుంది. ఆ తర్వాత రెండ్రోజుల్లో తమిళనాడు, దక్షిణ కోస్తా దిశగా వస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రేపు బుధవారం సాయంత్రానికి తుఫాన్‌గా మారుతుందని 17వ తేదీ గురువారం కల్లా మరింత బలపడి చెన్నైకు దక్షిణం వైపున తీరం దాటుతుందని, తీరం దాటే , సమయంలో తమిళనాడు,రాయలసీమ, ఆంధ్ర తీరప్రాంతాలలో గాలులు గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో వీస్తాయని పేర్కొన్నారు. అనంతరం వాయుగుండంగా బలహీనపడి అరేబియా సముద్రంలో ప్రవేశిస్తుందని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *