సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గత 6 గంటల్లో గంటకు 13 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ ఈ రోజు 27 నవంబర్ 2024 భారత కాలమానం ప్రకారం ఉదయం 08.గం.30 ని .లకు ,ఉత్తర అక్షాంశం 8.5°, తూర్పు రేఖాంశం 82.3°వద్ద కేంద్రీకృతమై ఉంది. నాగపట్టణానికి ఆగ్నేయంగా 370 కి.మీ., పుదుచ్చేరికి ఆగ్నేయంగా 470 కి.మీ, చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 550 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాగల 12 గంటల్లో మరింత బలపడి తుఫానుగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత రెండు రోజులలో ఈ తుఫాను,శ్రీలంక తీరం చుట్టూ కదులుతూ, ఉత్తర వాయవ్య దిశగా తమిళనాడు తీరం వైపు ప్రయాణిస్తుంది. ఈ నేపథ్యంలో నేడు, బుధవారం ఏపీలో సముద్ర తీరా ప్రాంతాలలో వేగంగా గాలులతో పాటు ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన భారీ జల్లులు తో కురిసే అవకాసమ్ ఉంది. రేపు ఎల్లుండి కూడా కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో వర్షాలు తీవ్ర చలిగాలులు ఉంటాయి. కోస్తా తీరంలో ఈదురు గాలులు,గంటకు-44 -55 కి మీ వేగం,గరిష్టం గా 65 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది
