సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బంగాళాఖాతంలో మొంథా తుఫాన్ ప్రభావం తో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తుఫానుకు థాయ్‌లాండ్ దేశం సూచించిన ‘మొంథా’ అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఇది చెన్నైకి 720 కి.మీ. తూర్పు ఆగ్నేయంగా, విశాఖపట్నానికి 790 కి.మీ. దక్షిణ ఆగ్నేయంగా, కాకినాడకు 780 కి.మీ. ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. గంటకు ఆరు నుంచి 10 కిలోమీటర్ల వేగంతో కోస్తాంధ్ర లోని గోదావరి జిల్లాల వైపు వస్తోంది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫాన్‌గా బలపడి కోస్తాంధ్రకు దగ్గరగా రానున్నది. దీని ప్రభావంతో రేపు ఉదయం కోస్తాంధ్రలో కుంభవృష్టిగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది. మంగళవారం సాయంత్రం లేదా రాత్రికి మచిలీపట్నం- కళింగపట్నం మధ్య కాకినాడ-తుని మధ్య తీరం దాటుతుందని ఐఎండీ తెలిపింది. అయితే తీవ్రతుఫాన్ విశాఖపట్నం-కాకినాడ మధ్య తీరందాటే అవకాశం ఉందని, కోస్తాలో తీరం వెంబడి గంటకు 60 నుంచి 70 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు. నర్సాపురం భీమవరం సమీపంలోని తీర సముద్ర ప్రాంతంలో ప్రమాద హెచ్చరికలు జారీ చేసారు. రేపటి తుపాను గాలుల ఉదృతి, భారీ వర్షాలు నేపథ్యంలో ప్రజలు బయటకు రాకపోవడమే మంచిది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో టెలీ కనిఫరెన్సు లతో అధికారులు అన్ని చోట్ల ముందస్తు జాగ్రత్తలు తీసుకొంటున్నారు.
