సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత 3 రోజులుగా భీమవరం పట్టణంతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలో వర్షాలు చెదురు మదురుగా కురుస్తున్నాయి. అయితే ఏపీకి తుపాను ముప్పు పొంచి ఉంది. దక్షిణ బంగాళాఖాతంలో రేపటి శనివారం నాటికి ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. తర్వాత పశ్చిమ దిశగా పయనించి, నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడనుంది. అది ఈ నెల 13 నుంచి 15 మధ్య వాయుగుండంగా రూపాంతరం చెందుతుందని రాష్ట్రంలోని దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు రాష్ట్రం మధ్యలో ఈ నెల 15 నాటికి తీరాన్ని తాకవచ్చని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ తీవ్ర వాయుగుండంగా బలపడి, ఈ నెల 17 నాటికి ఆంధ్ర రాష్ట్రంలోనే తీరందాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ భావిస్తోంది. .తుపాను ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ నెల 14 నుంచి 16 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
