సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తుపాను ప్రభావం తో గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఒక ఎత్తయితే నేడు, మంగళవారం ఉదయం 11 గంటల నుండి వంటి గంట వరకు కురిసిన వర్షం మరో ఎత్తు.. బాపట్ల వద్ద తుపాను తీరం దాటినప్పటికీ నేటి సాయంత్రం వరకు వర్షం పడుతూనే ఉంది.. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వర్షాకాలం సీజన్ లో ఎప్పుడు చూడని విధంగా భీమవరంలో చలిగాలులతో కూడిన కుంభ వృష్టి, వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి వరకు దుర్గాపురం, లంకపేట, మెంటే వారి తోట, కళాభవన్ వీధి వంటి పల్లపు ప్రాంతాలు జలమయం అయితే నేడు, మంగళవారం మాత్రం ఎక్కడ చుసిన నీరే.. ఎత్తుగా ఉండే జేపీ రోడ్డు, పీపీ రోడ్డులు కూడా జలమయం అయ్యాయి. అయితే ప్రధాన రహదారులకు ఇరువైపులా డ్రైనేజీ వ్యవస్థ కాస్త బాగుండటంతో.. ఇటీవల డ్రైన్స్ లో చెత్త తొలగించిన నేపథ్యంలో.. మురుగు నీరు వేగంగా లాగుతుంది. అయితే 3 టౌన్ లోని హోసింగ్ బోర్డు కాలనీ, నరసయ్య అగ్రహారం తో పాటు ప్రధాన రోడ్డులు చెరువులను తలపిస్తున్నాయి. వాహనాలు రాకపోకలు తీవ్ర ఇబ్బంది ఉంది. అయితే గత 3 రోజలుగా.. ఇంత వర్షంలోనూ శానిటరీ మునిసిపల్ వర్కర్స్ సమర్ధవంతంగా పనిచేస్తుండటం అభినందనీయం.. నిజంగా వారి కష్టం చుస్తే దేవుళ్లు కనిపిస్తున్నారు.. ఇక భీమవరం పరిసర ప్రాంతాలలోని వరి పొలాలు వర్షపు నీరుతో చెరువులను తలపిస్తున్నాయి. ఆక్వా వ్యవసాయ దారులు కూడా చేపలు , రొయ్యల పంటలు కాపాడుతుకోవడానికి నానా తిప్పలు పడుతున్నారు. మరో 2 రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం.. వచ్చే సంక్రాంతి పండుగకు ప్రజల ఆర్ధిక పరిస్థితి ఫై తీవ్ర ప్రభావం పడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *