సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర ప్రభుత్వ విప్, భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నేడు, మంగళవారం, స్థానిక క్యాంపు కార్యాలయం లో వ్యవసాయ శాఖ, మున్సిపల్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు, భీమవరం నియోజకపరిధిలో మిచౌంగ్ తుఫాన్ ప్రభావం వల్ల రైతులకు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగానే భీమవరం మండలం, వీరవాసరం మండలం తాసిల్దారులతో ఫోన్లో మాట్లాడి ప్రజలకు ఎక్కడ విపత్తు వాటిల్లిన ఆదుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ తుఫాను ప్రభావం తగ్గే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. రైతులు ఆందోళన చెందనక్కర్లేదని, ప్రతి ధాన్యపు గింజను కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నారు. వ్యవసాయ అధికారులు రైతు భరోసా కేంద్రాల సిబ్బంది సహకారం తీసుకుని నియోజకవర్గంలో పంట పొలాల పరిస్థితి, ఆరబెట్టిన ధాన్యం పరిస్థితిపై నివేదికలు తయారు చేయాలని ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *