సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు వాటి పరిష్కారానికి అవసరమైన కార్యాచరణ రూపొందించుటకు ఈనెల 4 న భీమవరంలో రైతు సంఘం జిల్లా సమావేశం నిర్వహించనున్నట్టు సిపిఐ జిల్లా కార్యదర్శి, కొనాల భీమారావు తెలిపారు. రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవివి ప్రసాద్ ఈసమావేశానికి హాజరవుతున్నారన్నారు. తుఫాన్ కారణంగా జిల్లాలో సార్వా రైతాంగం పంట నష్టపోకుండా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని,రైతాంగానికి అవసరమైన సహాయ సహకారాలందించాలని , పశ్చిమ గోదావరి జిల్లాలో వరికోతలు ముమ్మరంగా జరుగుతున్న పరిస్థితుల్లో, ఇక్కడ సమీపంలోని మచిలీపట్టణం మీదుగా తీరం దాటే అవకాశం ఉందని, రెండు రోజులు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చేసిన ప్రకటనతో జిల్లా రైతాంగం తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు. ఇప్పటికే జిల్లాలో 65 శాతం వరికోతలు పూర్తి కాగా ఇంకా 35 శాతం వరి కోతలు జరుగవలసి వుందన్నారు. కళ్ళాల మీద వున్న ధాన్యం వర్షాలు కారణంగా నష్ట పోకుండా రైతులకు అవసరమైన బరకాలు,టార్పలిన్ లు సంచులు సరఫరా చేయాలని భీమారావు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *