సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సీఎం జగన్ నేడు, నెల్లూరు, తిరుపతి, బాపట్ల జిల్లాలలో పర్యటించి తుఫాన్ బాధితులను పరామర్శించి, తుపాను ఫొటోల ఎక్సబిషన్స్ ను పరిశీలించి, నష్టపోయిన రైతులను, బాధితులకు అన్ని రకాలుగా ప్రభుత్వం తోడుగా ఉంటుందని సీఎం జగన్ భరోసా ఇచ్చారు. ‘‘పంట నష్టపోయిన రైతులని ఆదుకుంటాం. రైతులకు సబ్సిడీతో విత్తనాలు అందిస్తాం. వారంలోగా ఇన్సూరెన్స్ సాయం అందుతుంది. విద్యుత్ సరఫరాని కూడా యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరిస్తున్నాం. రాష్ట్రంలో 60వేల పైగా తుపాను బాధిత కుటుంబాలకు ఆహార దినుసులతో కిట్ తో పాటు 2,500 రూపాయలు అందజెయ్యడం జరుగుతుందని అన్నారు. సమర్ధవంతమైన వాలంటీర్ వ్యవస్థ ద్వారా వీటిని అమలు చేస్తాం.. స్వర్ణముఖి కాలువకి పడిన గండిని పరిశీలించాను. భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా హై లెవెల్ బ్రిడ్జిని రూ.30 కోట్లతో నిర్మిస్తాం. కొన్నిచోట్ల చెరువులు గండ్లు పడ్డాయి. వాటిని వీలైనంత త్వరగా రీస్టోర్ చేస్తాం. ఈ ప్రభుత్వం మీది అని భావించండి. రాజకీయాలకు అతీతంగా బాధితులకు సాయం అందకపోతే, జగనన్నకి చెబుదాం కింద 1902కి ఫోన్ చేయండి. నాలుగైదు రోజుల్లోగా పూర్తిస్థాయిలో అందరికీ సాయం అందుతుంది అన్నారు.
