సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మోంథా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన ప్రతిఒక్కరిని ఆదుకుంటామని భీమవరం ఎమ్మెల్యే, పులపర్తి రామాంజనేయులు అన్నారు. నేడు, బుధవారం ఉద్యమ వీరవాసరంలోని ఎంఆర్ కె జెడ్పి హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించారు. సుమారు 100 మందికిపైగా ఉన్న బాధితులను పరామర్శించి మీడియాతో మాట్లాడుతూ. మోంథా తుఫాన్ తీవ్రతతో మన ప్రాంత రైతులు ఎంతో నష్టపోయారని, పంటలు మునిగిపోయాయని, శివారు ప్రాంతాల్లో రోడ్లు కూడా పూర్తిగా పాడైపోయాయని అన్నారు. తుఫాన్ ప్రభావాన్ని పకడ్బందీ ప్రణాళికలతో ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం పూర్తి చేసిందని, అధికారులు, సిబ్బంది అందరినీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసిందన్నారు. రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు,ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉందన్నారు. వీరవాసరం లోని ప్రభుత్వాసుపత్రి లోని గర్భిణులకు దాతల సహకారంతో ఏర్పాటు చేసిన పౌష్టికాహారాన్ని ఎమ్మెల్యే అంజిబాబు అందించారు. కార్యక్రమంలో ఎంపిపి, ఎంటిసిలు, సర్పంచ్ లు, గ్రామస్థులు, పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *