సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మిచాంగ్ తుఫాన్ దెబ్బకు పశ్చిమ గోదావరి జిల్లాలో వరి పంటచేతికోస్తున్న పొలాల్లో నీరు చేరి.. మరొ రోజులు ఇదే తీరున వర్షాలు కురిస్తే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లు తున్న నేపథ్యంలో రైతులు ఎవ్వరు అధైర్యపడద్దని.. ప్రభుత్వం ఆదుకొంటుందని రాష్ట్ర పౌరసరాఫరాల శాఖా మంత్రి, కారుమూరి వెంకట నాగేశ్వరరావు భరోసా ఇచ్చారు. నేడు, . మంగళవారం తణుకు నియోజకవర్గంలోని దువ్వ, వరిగేడు గ్రామాల్లో మంత్రి పర్యటించి పొలాల లో పంటల నష్టాల్ని పరిశీలించి స్థానిక రైతులతో మాట్లాడారు. ఎలాంటి పరిస్థితిలో ఉన్న ధాన్యాన్ని అయినా ప్రభుత్వమే కొంటుందని భరోసా ఇచ్చారు. వీలైనంత త్వరగా రైతులు తమ ధాన్యాన్ని అందుబాటులో ఉన్న మిల్లులకు తరలించుకోవాలన్నారు. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ రెండు విధాలుగానూ ధాన్యాన్ని తరలించే వెసులుబాటు కల్పించామన్నారు. ఏ మిల్లరైనా రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. తుఫాన్ తీవ్రత తగ్గే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశాలు ఇచ్చారు.
