సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్ : ఈ పేకాట వ్యసనం ఉందే .. దొరకనంతవరకు విలాస గేమ్.. పోలీస్ లకు దొరికమా? ఎంతటి వారినైనా వారి పరపతి, హోదా, పరువు దిగజారుస్తుంది. తాజాగా వార్త సమాచారం మేరకు..తూర్పు గోదావరి జిల్లాలోని కోరుకొండ మండలం రాఘవపురంలో పేకాటశిబిరంపై పోలీసుల దాడి చేశారు. ఎవరు ఉహించనివిధంగా స్పాట్లో పేకాట ఆడుతూ కొత్త పేట తహశీల్దార్ కిషోర్‌బాబు పోలీసులకు దొరికిపోయారు. పోలీసులు ఎటువంటి భేషజాలకు పోకుండా విధినిర్వహణ చేసారు. ఆయనతో పాటు మొత్తం 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 11 సెల్‌ఫోన్లు, రూ.94 వేలు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
