సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణలో ఇంజనీరింగ్ కన్వీనర్ కోటా సీట్లకు సంబంధించి ఈ విద్యా సంవత్సరం నుంచి ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థులకు ఇస్తున్న నాన్ లోకల్ కోటాను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తెలంగాణ విద్యార్థులకే సీట్లన్నీ దక్కనున్నాయి.రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రపతి ఉత్తర్వులుమేరకు గత పదేళ్లుగా అమలవుతున్న 15 శాతం అన్ రిజర్వుడ్ కోటా కింద లబ్ధి పొందుతున్న ఏపీ విద్యార్ధులకు ఇకపై తెలంగాణ విద్యా సంస్థల్లో చదువుకునే ఛాన్స్ పూర్తిగా రద్దైంది. నిజానికి, గత విద్యా సంవత్సరం నుంచే 15 శాతం కోటా రద్దు అమల్లోకి రావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల రిత్య నాన్ లోకల్ కోటాను అమలు చేశారు. ఈ మేరకు ప్రొఫెషనల్ కాలేజీల్లో అడ్మిషన్స్ గైడ్‌లైన్స్‌లో సవరణలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది.
