సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో అధికారంలోకి రావడానికి కావలసిన 60 మ్యాజిక్ ఫిగర్ దాటి కేవలం 4 సీట్లు అదనంగా గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని మరింత పెంచుకోకపోతే వాటిల్లే ముప్పు పసిగట్టి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ‘ఆకర్ష్ ‘ ప్యూహాన్ని ‘ పరోక్షంగా అమలు చేస్తున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. గతంలో సీఎం కెసిఆర్ కూడా ఇదే పార్ములాతో 20 మంది కాంగ్రెస్ బలాన్నికేవలం 6 కు కుదించారు. మరి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేద్దాం అనుకుంటున్న రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందుకోసం బీఆర్ఎస్‌ను బలహీనం చేయడంపై దృష్టిసారించింది. ఎందరో బిఆర్ ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి ని అభినందిస్తూ కలుస్తున్నారు. ఇది త్వరలో ఏ పరిణామాలకు దారి తీస్తుందో కాస్త రాజకీయ అనుభవం ఉన్నఎవరైనా చెప్పేస్తారు. కాంగ్రెస్ మొదటగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చేందుకు వ్యూహాలు రచిస్తోందని తెలుస్తోంది. ఈ ప్రయత్నాలలో భాగంగా ఇప్పటికే ముస్తాబాద్ జెడ్పీటీసీ, పలువురు కౌన్సిలర్లు, సర్పంచులు రాజీనామాలు బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పారు. ఇప్పటికే దాదాపు 40 మున్సిపాలిటీల్లో అవిశ్వాసానికి కాంగ్రెస్ రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. వీరంతా కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. మరి బిఆర్ ఎస్ పార్టీని కాపాడుకోవడానికి మాజీ సీఎం కెసిఆర్ ఏ వుహ్యరచన చేస్తున్నారో?.. సిగ్మాప్రసాద్ కాలమ్స్
