సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, ఆదివారం తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో .. ఇప్పడు సమయం 12 గంటల 10 నిమిషాలకు మొదటి 2 స్థానాలు ఫలితాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికారికంగా వెలువడగా ఆ 2 రెండు స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకొంది కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం ..అశ్వారావుపేట నియోజకవర్గంలో 23,358 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి జరే ఆదినారాయణ గెలుపొందారు. కాంగ్రెస్ ఖాతాలో రెండో విజయం .. ఇల్లందు నియోజకర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య గెలుపొందారు . ఇక తెలంగాణ ఎన్నికలలో ప్రస్తుత సమాచారం ప్రకారం .. కాంగ్రెస్ అభ్యర్థులు 71 స్థానాలలో బి ఆర్ ఎస్ 34 స్థానాలలో, బీజేపీ 7స్థానాలలో ఎం ఐ ఎం 5స్థానాలలో ఆధిక్యతలో ఉన్నారు. ఆంధ్ర ప్రజలు ఎక్కువ ఉండే ఉమ్మడి ఖమ్మం లో 10 కి 10 (మిత్ర పక్షం సిపిఐ తో కలపి ) ఉమ్మడి నల్గొండ జిల్లాలో సూర్యాపేట మినహా 11 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉండటం విశేషం.. సీఎం కెసిఆర్ పోటీచేస్తున్న కామారెడ్డి లో వెనుకంజ లో ఉండగా మొదటి స్థానంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ విజయబావుటా రెపరెప లాడిస్తునారు…
