సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణ లోని కొండగట్టు పుణ్యక్షేత్రంలో శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకున్న జనసేనాని పవన్ కళ్యాణ్ తన వారాహి’ ఎన్నికల రథానికి ప్రత్యేక పూజలు కూడా చేయించారు. తదుపరి మీడియాతో మాట్లాడుతూ.. ,ఆంధ్రాతో తెలంగాణను పోల్చి చూడలేమని చెప్పారు. తెలంగాణ సమస్యలపై లోతైన అధ్యయనం చేసిన తర్వాతనే పోటీపై నిర్ణయం తీసుకుంటామని, ఇక్కడ జనసేనకు 10 మంది ఎమ్మెల్యేలు ఉంటే బాగుంటుంది.. ( అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాదే.. లోక్ సభ 2014లో మరి )అలాగే ఏడు నుంచి 14 పార్లమెంటు స్థానాల్లో తెలంగాణ ప్రాంతంలో పోటీ చేస్తామని పవన్ తెలిపారు. బీజేపీ ఎప్పుడూ తనకు దోస్తేనని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే తెలంగాణలో అభివృద్ధి జరిగిందని, తెలంగాణలో కచ్చితంగా పర్యటిస్తానని పవన్ స్పష్టం చేశారు. తెలంగాణ నేలలో పోరాట స్ఫూర్తి ఉందని, తనకు పునఃజన్మ ఇచ్చిన నేల తెలంగాణ అని పవన్‌ అన్నారు. తెలంగాణ ప్రజలకు సందేశాలు ఇచ్చే స్థాయిలో తాను లేను అని పవన్‌ తెలిపారు. తెలంగాణ ప్రజల నుంచి పోరాటాన్ని నేర్చుకుంటున్నానని, తెలంగాణలో తమతో పొత్తుకు ఎవరైనా వస్తే స్వాగతిస్తామని పవన్‌ తెలిపారు. తెలంగాణాలో చాల విషయాల్లో తాను తగ్గి మాట్లాడుతున్నాను.. భయపడికాదని పవన్‌ వెల్లడించారు. తెలంగాణలో పరిమితులతో కూడిన ఆట ఆడుతున్నానని, ఏపీతో పోల్చుకుంటే తెలంగాణ బాగా అభివృద్ధి చెందిందని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *