సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో ఎట్టకేలకు జనసేన కు కేవలం 8 స్థానాలను బీజేపీ కేటాయిస్తూ నేడు, ఆదివారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధికారికంగా ప్రకటన చేసారు. అలాగే ఈ నెల 7వ తేదీన తెలంగాణాలో ప్రధాని మోడీ పాల్గొనే బహిరంగ సభలో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొంటారని ప్రకటించారు. నిజానికి తెలంగాణ లో 32 స్థానాల్లో పోటీ చేయాలని జనసేన నిర్ణయం కూడా తీసుకుంది. పవన్ కళ్యాణ్ కనీసం 20 స్థానాలు కావాలని అడిగినప్పటికీ జనసేనకు బీజేపీ 11 సీట్లు కేటాయిం చినట్టు ప్రచారం జరిగింది. తీరా ఈ రోజు ప్రకటనలో కేవలం 8 స్థానాలకు అదికూడా జనసేనకు గోదావరి జిల్లా ప్రజలు ఎక్కువ ఉండే ‘కూకట్ పల్లి’ కేటాయించడం మినహా బీజేపీ కి పెద్ద ప్రభావం లేని ..ఖమ్మం జిల్లాలో జనసేన కు సీట్లు కేటాయించడం గమనార్హం. గ్రేటర్ హైదరాబాద్లో సీమాంధ్రులు ఎక్కువగా ఉన్న మల్కా జ్గిరి, శేర్లింగంపల్లి, కోసం జనసేన పట్టుపట్టినప్పటికీ కిషన్ రెడ్డి వాటిని బీజేపీకీ వదులుకోవాలని పవన్ కు సూచించి వాటి విషయం వాయిదా వేసినట్లు తెలుస్తుంది. ఇతర జిల్లాల్లోని తాండూర్, కోదాడ, నాగర్కర్నూల్, ఖమ్మం , వైరా, కొత్తగూడెం , అశ్వా రావుపేట నియోజకవర్గాలను జనసేనకు కేటాయించింది. దీనితో ఈ మాత్రం నామమాత్రం పోటీ కి ఇంత హడావిడా? అంటూ తెలంగాణ జనసైనికులు నివ్వెర పోతున్నారు.
