సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: తెలంగాణాలో ఇటీవల ఎన్నికలలో బీజేపీ తో షాక్ లు తింటున్న అధికార టిఆర్ఎస్ పార్టీ నేడు మంగళవారం జరిగిన 6 ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కౌంటింగ్ మంచి జోష్ ను పెంచింది. 6 చోట్ల విజయం సాదించడంతో ఆ పార్టీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా, ఆరూ టిఆర్ఎస్ గెలుచుకుంది. నల్లగొండలో కోటిరెడ్డి, ఖమ్మంలో తాతా మధు, కరీంనగర్‌-1లో భాను ప్రసాద్‌, కరీంనగర్‌-2లో ఎల్‌. రమణ, ఆదిలాబాద్‌లో దంతె విఠల్‌, మెదక్‌లో యాదవరెడ్డి విజయం సాధించారు.మెదక్‌లో కాంగ్రెస్ ఎమ్యెల్యే జగ్గారెడ్డి సతీమణి నిర్మల ఓటమి పాలయ్యారు. కరీంనగర్ లో టిఆర్ఎస్ రెబెల్ అభ్యర్ధి రవీంద్రర్ సింగ్ కోసం బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కృషి చేసినా,ఫలితం దక్కలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *