సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వరుస హ్యాట్రిక్ హిట్స్ ఉన్న ‘మాస్ అఫ్ గాడ్’ బాలకృష్ణ లాంటి సీనియర్ అగ్ర హీరో సినిమా అఖండ 2కు అడుగడుగున అవాంతరాలు ఎదురవుతున్న నేపథ్యంలో దీనివెనుక ఎదో ఆజ్ఞత శక్తి ఉందని ప్రచారంలో ఎంత నిజం ఉందొ తెలియదు కానీ.. ఎట్టకేలకు నేటి గురువారం రాత్రి నుండి ప్రీమియర్ షో లతో రిలీజ్ అవుతున్న అఖండ 2 సినిమాకు మరో షాక్ తగిలింది. నేడు మరికొన్ని గంటలలో ప్రీమియర్లు ప్రదర్సన కానున్న నేపథ్యంలో ఈ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక అనుమతి సర్కులర్ ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. ఈ సినిమాకు మొదటివారం పెంచిన టికెట్ ధరలను తగ్గిస్తూ అలాగేఏకంగా నేటి ప్రీమియర్లను కూడా క్యాన్సిల్ చేస్తూ ఉత్తర్వులు వెల్లడించారు. దీనితో ఒక్కసారిగా చిత్రబృందం, అభిమానులు తీవ్రస్థాయిలో నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పుడు తెలంగాణలో ప్రీమియర్లను నిలిపివేయడంతో గందరగోళం తలెత్తింది ప్రీమియర్ల కోసం అభిమానులు ఏకం గా 600 రూపాయల పెట్టి టికెట్ కొనుగోలు చేశారు. ఇలా చివరి నిమిషం లో సినిమా వాయిదా పడటం తో ఈ డబ్బులను తిరిగి రీఫండ్ చేస్తారా? లేదా ? అనేది తెలియాల్సి ఉంది. మరి కొద్దీ గంటలలో మాములు రేటుకే అఖండ 2 సినిమా తెలంగాణ ప్రేక్షకులకు చూపిస్తారా?అడ్వాన్స్ టికెట్స్ అమ్మకాలలో కోట్ల రూపాయలు అదనపు కలెక్షన్ తిరిగి ప్రేక్షకులకు తిరిగి ఇచ్చేస్తారా?నిజం నిష్ఠురమైన ఇకపై అందరి హీరోలకు ఇదే పద్దతి పెడితే అభిమానుల డబ్బు వృధా కాదు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *