సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ‘తెలంగాణ లో సరూర్నగర్లో నేడు, సోమవారం కాంగ్రెస్ నిర్వహించిన ‘ యువ సంఘర్షణ సభ’కు ముఖ్య అతిథిగా ప్రియాంక గాంధీ హాజరయ్యారు. ‘ జైబోలో తెలంగాణ ’ అని తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘‘తెలంగాణ మీకు తల్లి వంటిది. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగింది. తెలంగాణ కోసం ఎందరో ఆత్మ బలిదానాలు చేశారు. తెలంగాణ ఇవ్వాలనే నిర్ణయం అంత ఈజీగా చేసింది కాదు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ప్రత్యేక రాష్ట్రం ఇవ్వలేదు. ప్రజల ఆకాంక్షల మేరకే సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు. సోనియా తెలంగాణ ఇచ్చి 9 ఏళ్లయినా ప్రజల ఆకాంక్షలు నెరవేర లేదు. ఇక్కడ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తోంది. బీఆర్‌ఎస్ నేతలు తెలంగాణ తమ జాగీరులా భావిస్తున్నారు’’ అని ప్రియాంక గాంధీ విమర్శించారు. తెలంగాణ ఏర్పడ్డాక 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ప్రియాంక అన్నారు. నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇస్తామన్నారు.. ఇప్పుడు ఏమైంది? అని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు రూ. 4 వేలు భృతి ఇస్తామని సంచలన ప్రకటన చేసారు. యువతకు రూ. 10 లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణాలో అవినీతి మయం అయిపోయిందని, అభివృద్ధి కుంటుపడిందని, ఉద్యోగాలు లేక లక్షలాది మంది నిరుద్యోగులు అల్లాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మరో పక్క పరీక్షల పేపర్లు లీక్ అవుతున్నాయని,. 9 ఏళ్లలో ప్రభుత్వం ఒక్క యూనివర్సిటీ ఏర్పాటు చేయలేదని, రాష్ట్రంలో ప్రతి వ్యక్తిపై రూ.వేల అప్పులు మోపారని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంక్షేమం కోసమే పనిచేస్తామని ప్రియాంకగాంధీ ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *