సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్ : తెలంగాణాలో రాష్ట్ర పోలీసు విభాగంలో పని చేస్తున్న హోంగార్డులకు రోజువారీ జీతం 30 శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటి వరకు వీరికి రోజుకు రూ.675 వేతనం వచ్చేది. తాజా పెంపు నేపథ్యంలో ఇకపై రోజుకు రూ.877 జీతంగా రానుంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని 20 వేల మందికిపైగా హోంగార్డులకు వేతనాలు పెరగనున్నాయి. దీనితో తెలంగాణాలో హోంగార్డ్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
