సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణ ఎంసెట్లో ఈ ఏడాది నుంచి ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీని శాశ్వతంగా రద్దు చేస్తూ విద్యాశాఖ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి ఎంసెట్లో వచ్చిన మార్కులతోనే ర్యాంకు కేటాయించనున్నారు. ఇప్పటి వరకు ఎంసెట్ మార్కులకు 75 శాతం వెయిటేజీ, ఇంటర్లోని ఇతర భాషలలోని సబ్జెక్టులకు కలపి …అంటే 600 మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకు కేటాయించేవారు. ఇక నుంచి ఇంటర్ మార్కులతో సంబంధం లేకుండానే ఎంసెట్లో స్కోర్ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. జేఈఈ మెయిన్, నీట్లలోనూ ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఎత్తివేశారు. ఎంసెట్ కు పలు బోర్డుల నుంచి విద్యా ర్థులు హాజరవుతారు. ఆయా బోర్డులు సకాలంలో ఫలితాలను విడుదల చేయకపోవడం , ఎంసెట్అధికారులకు అందజేయకపోవడం వల్ల ఎం సెట్ ఫలితాలకు ఆటంకం ఏర్పడుతోం ది. ఇకపై ఇటువంటి ఆటంకాలు ఉండవు. నిజానికి తెలంగాణలో కరోనా కారణం గా 2020, 2021, 2022లలో కూడా ఇంటర్ వెయిటేజీని తొలగించారు. ఈసారి దానిని శాశ్వతం గా రద్దు చెయ్యడం గమనార్హం.
