సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఉమ్మడి రాష్ట్ర విభజన అంశంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృ ష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, సజ్జల గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టం అసం బద్ధమని ఇప్ప టికే సుప్రీం కోర్టులో కేసు ఉంది. సమైక్య ఆంధ్ర ప్రదేశ్ కోసం అలుపెరగని పోరాటం చేసింది వైసిపి నే.. ఇప్పటికి వైసిపి వైఖరి అదే. అయితే మళ్లీ ఉమ్మ డి రాష్ట్రం కాగలిగితే తొలుత స్వాగతించేది వైఎస్సా ర్సీపీనే అని స్పష్టం చేశారు. ఇటీవల సీఎం జగన్ తన వైఖరి మార్చుకొన్నాడని అనుమానం వ్యక్తం చేసిన మాజీ ఎంపీ ఉండవల్లి వ్యా ఖ్య లు అసంబద్ధమైనవని అన్నారు. ‘‘అప్పట్లో టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ విభజనకు అనుకూలంగా వ్యవహరించాయి. విభజనకు వ్య తిరేకం గా కోర్టుల్లో మా వైసిపి తరపున వాదనలు బలం గా వినిపిస్తాము. రాష్ట్ర విభజనను వెనక్కి తిప్పాలి.. లేదంటే సరిదిద్దాలని గట్టిగా కోరుతాము. ఇప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కలిసి ఉండాలన్నదే మా విధానం . విభజన చట్టం లో హామీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేస్తూనే ఉం ది. రెండు రాష్ట్రాలు కలిసి ఉం డాలని సుప్రీం కోర్టు ఆదేశిస్తే అంతకంటే ఏం కావాలి అని సజ్జల పేర్కొ న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *