సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ మార్క్ దోబుచులాటలు ముగిసాయి. తెలంగాణ నూతన సీఎంగా రేవంత్ రెడ్డి పేరుని అధికారికంగా కాంగ్రెస్ పార్టీ తాజగా ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. తెలంగాణ కాంగ్రెస్ సీఎల్పీ భేటీలో అందిన తీర్మానాన్ని పరిశీలించిన అనంతరం సీఎంగా రేవంత్ రెడ్డిని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్ణయించారని ప్రకటించారు. సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని ఎంపిక చేసినట్టు వివరించారు. ఎల్లుండి… గురువారం సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.
