సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:ఢిల్లీ మద్యం కుంభకోణంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ పరువు తీశారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. లిక్కర్‌ స్కామ్‌పై అన్నా చెల్లెలు ఇద్దరూ అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆయన కేటీఆర్, కవితలను ఉద్దేశించి మీడియా సమావేశంలో విమర్శించారు. తెలంగాణలో ఎక్కడ చుసిన అవినీతి, ఆత్మహత్యల పరంపరతో ప్రజలలో విద్యార్థులలో అసంతృప్తి రగులుతుంది అని విమర్శించారు. హైదరాబాద్ అభివృద్ధి గురించి మంత్రి కేటీఆర్ గొప్పలు చెబుతారని గతంలో వాళ్ళు హైదరాబాద్ లో రోడ్లపై గతుకులు చూపిస్తే వెయ్యి రూపాయలు ఇస్తామన్నారని, తాను ఇప్పడు సవాల్ చేస్తున్నాని హైదరాబాద్ లో గతుకులు లేని రోడ్డు చూపిస్తే లక్ష రూపాయలు ఇస్తానని సవాల్ చేసారు. మోడీపై ద్వేషం పెంచుకొని.. ప్రజల ఆరోగ్యం కోసం ప్రధాని మోడీ.. ఆయూష్మణ్ .. పధకాన్ని దక్షిణాన ఆంధ్ర ప్రదేశ్ తో సహా అందరు అమలు చేస్తుంటే కెసిఆర్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు అది అందకుండా చేసిందని విమర్శించారు. అబద్ధాలు చెప్పడంలో బీఆర్ఎస్ నేతలను మించినవారు లేరని కిషన్‌రెడ్డి చెప్పారు. ఢిల్లీ వెళ్లి ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి లిక్కర్‌ స్కామ్‌ చేయాలని చెప్పామా? అంటూ ఆయన కేటీఆర్, కవితలను ఉద్దేశించి ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్లపై మాట్లాడే హక్కు కల్వకుంట్ల ఫ్యామిలీకి లేదన్నారు. లిక్కర్‌ స్కామ్‌పై దృష్టి మళ్లించేందుకే ఢిల్లీలో ధర్నా నాటకాలు ఆడుతున్నారని, సానుభూతి కోసమే బీఆర్‌ఎస్‌ డ్రామాలాడుతోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. అక్రమ వ్యాపారంలో ఇరుక్కుపోయి, అక్రమాలు చేస్తూ మోదీని తప్పుపడతారా? అని కిషన్‌రెడ్డి విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *