సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎన్నో అడ్డంకులు తరువాత తెలంగాణ రాష్ట్ర మంత్రిగా కాంగ్రెస్ నేత ఒకప్పటి ప్రఖ్యాత క్రికెటర్, భారత్ మాజీ కెప్టెన్ ‘అజారుద్దీన్‌’ నేడు, శుక్రవారం రాజ్ భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డితో పాటుగా పలువురు మంత్రులు పాల్గొన్నారు. ప్రస్తుతం రేవంత్ కేబినేట్ లో ఇంకా రెండు మంత్రి పదువులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఓసీ, బీసీలకు చోటు దక్కే అవకాశం ఉంది. ఇక అజారుద్దీన్‌ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించారు. గవర్నర్ ఆమోదించాల్సి ఉంది. ప్రస్తుతానికి అజారుద్దీన్‌కు, మైనార్టీ సంక్షేమం, క్రీడలు లేదా హోం శాఖ వంటి కీలక శాఖల్లో ఏదో ఒకటి దక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే ఒక ప్రక్క జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళి ఉల్లంఘించి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారని బీజేపీ ఈసీ కి దీనిపై పిర్యాదు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *