సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మాజీమంత్రి పేర్ని నాని నేడు, సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు మాట్లాడటం తన మనసు గాయపరిచింది అని పవన్ కళ్యాణ్ అంటున్నారని.. తెలంగాణ మంత్రి హరీష్ రావు ఎదో ‘ఇది’ తో అన్న మాటలకూ వైసీపీ తెలంగాణ ప్రజలను కించపర్చిందని కొత్తగా కిరాయి మాటలు మాట్లాడుతున్నాడని, ఆంధ్ర వాళ్ళు అక్కడ వ్యాపారాలు చేస్తున్నారని, ఆస్తులు ఉన్నాయని బెదిరింపు మాటలు మాట్లాడుతున్నాడని, మంత్రి బొత్య ను బెదిరిస్తున్నాడని, ఆరోపించారు. మరి తెలంగాణాలో ఆస్తులు, నివాసం ఉండి నువ్వు ఏపీలో రాజకీయాలు చెయ్యడం లేదా? నువ్వు బీజేపీ తో పొత్తు పెట్టుకొన్న సరే హైదరాబాద్ లో ఉంటున్నావు , సినిమాలు, వ్యాపారాలు ఆస్తులు ఉన్నాయి, కాబ్బటి అక్కడ కెసిఆర్ పార్టీ తో కలిసావా? ఆంధ్ర జ్యోతి.. రాధాకృష్ణ చెప్పినట్లు కెసిఆర్ దగ్గర నీకు 1000 కోట్లు ప్యాకేజీ వ్యవహారం నిజమేనా? అందుకేనా ఈ కొత్త వకీల్ పాత్ర? ఆంధ్ర వారిని తెలంగాణ మంత్రులు “ఇది” తో తిడుతుంటే మేము సమాధానం చెబుతుంటే.. నీవెందుకు ఆవేశపడుతున్నావో తెలియడం లేదు.. పవన్ కళ్యాణ్‌కు ఈ కొత్త బాధ ఎంటో అర్ధం కావడం లేదని అన్నారు. ‘‘పవన్ కళ్యాణ్ ది ఆంద్రప్రదేశ్ కాదా?.. నీ సినిమాలు, రాజకీయం కోసమే ఆంధ్రప్రదేశ్ కావాలా?.. పవన్ కళ్యాణ్ తెలంగాణ వాళ్ళకి లొంగిపోయాడా?’’ అంటూ వరుసగా ప్రశ్నలు సంధించారు. ఏపీని తెలంగాణ మంత్రి కించపరిస్తే అది వేరే అని పవన్ అంటున్నారన్నారు. తెలంగాణ తరుపున వకాల్తా పుచ్చుకొని పవన్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇవి కిరాయి మాటలు కాదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పొత్తు ఉన్న..ఇంతకు ముందు చంద్రబాబు, లోకేష్‌ను అంటే పవన్ వచ్చేవాడని.. ఇప్పుడు కొత్తగా తెలంగాణ మంత్రులను ఏదైనా అంటే పవన్ కళ్యాణ్ వకాల్తా పుచ్చుకుంటున్నారని విమర్శించారు.
