సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణాలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ నేడు, శుక్రవారం ఉదయం నుండి కొనసాగుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ సత్తా చాటుతోంది. రాష్ట్రంలోనిమొత్తం 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకుసంబంధించిన ఎన్నికల ఫలితాలలో అయితే నేటి మద్యాహ్నం 1గంటకు అధికారికంగా ప్రకటించిన ఫలితాలలో 24 మునిసిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం సాధించగా 6 చోట్ల బీఆర్ ఏస్ విజయం సాధించింది. ఇంకా బీజేపీ బోణి కొట్టలేదు. ఇప్పటికే 70 శాతం పైగా సింహభాగం విజయాలు కాంగ్రెస్ కైవసం చేసుకొనే దిశగా కనపడుతుంది. అత్యధిక స్థానాల్లో దూసుకుపోతోంది. బిఆర్ ఎస్ అభ్యర్థులు కొన్ని మెరుపు విజయాలు సాధిస్తున్నారు. ఇక, ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ కాంగ్రెస్ మొత్తం స్థానాలలో మొత్తం స్థానాలలో సత్తా చాటుతోంది. ఇక నిజామాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లాలో బీజేపీ అభ్యర్థులు విజయదిశగా పయనిస్తున్నారు. నేటి సాయంత్రానికి పట్టణాల వారీగా అన్ని వార్డుల సమాచారం వస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *