సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా సుదీర్ఘ కాలం పనిచేసిన తమిళిసై సౌందరరాజన్ నేడు, సోమవారం తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి పంపించారు. ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తమిళిసై బీజేపీ తరుఫున చెన్నై సెంట్రల్ లేదా తుత్తుకూడి నుంచి ఎంపీగా పోటీ చేయనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం అదనపు చార్జి గా కొనసాగుతున్న పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి సైతం తమిళిసై రాజీనామా చేశారు. గవర్నర్ పదవి చేపట్టడానికి ముందు తమిళనాడు బీజేపీ చీఫ్‌గా వ్యవహరించిన ఆమె ఇప్పుడు అదే రాష్ట్రం నుంచి లోక్‌సభ బరిలోకి దిగటానికి సన్నాహాలు చేసుకొంటున్నారు.
