సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయవాడలో ట్రిపుల్ ఐటీ ప్రవేశాల ఫలితాలు విడుదల అయ్యిన సందర్భముగా విద్య శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో తెలంగాణ లో విద్య వ్యవస్థ గురించి ఒక విలేకరి అడిగిన ప్రశ్న కు సమాధానంగా .. తెలంగాణ విద్యా వ్యవస్థపై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యా ఖ్య లు చేశారు. .‘‘ఏపీ విద్యా విధానాన్ని ‘ఆఫ్ట్రాల్ తెలంగాణతో’ పోల్చి చూడటం సరికాదు. అక్కడంతా చూచి రాతలు, పరీక్షా పేపర్లు లో లీక్ ల కుంభకోణాలు రోజూ చూస్తున్నాం . ఉపాధ్యా యుల బదిలీలు కూడా చేసుకోలేని దుస్థితి తెలంగాణది. మనవిధానం మనది.. మన ఆలోచనలు మనవి’’ అని బొత్స వ్యాఖ్యానించారు.ఇటీవల తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోవడం కూడా గమనార్హం. వాలంటీర్ వ్యవస్థపై పవన్ ఆరోపణలు ఫై కూడా బొత్య స్వాందిస్తూ .. ఆ వ్యవస్థ ఎలా పుట్టిందో, కరోనా సమయంలో , ఎలాంటి సాహసోపేతమైన పనులతో ప్రజలను కాపాడిందో పవన్ తెలుసుకోవాలి. దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న వాలంటీర్ వ్యవస్థపై పవన్ దుర్బుద్ధితో విషప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.అసలు అతని వ్యాఖ్య లపై ఎవరూ పట్టించుకోకుంటేనే మంచిదన్నారు. పొద్దు పొద్దున్నే మాకెందుకీ రచ్చ ?అంటూ అసహనం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *