సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తిరిగి తెలంగాణ రాష్ట్రము ఏర్పడ్డాక హైదరాబాద్ లో నేడు, శనివారం తొలిసారి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ లో కేంద్ర హోం మత్రి అమిత్ షా ప్రసంగిస్తూ.. తెలంగాణ ప్రజలకు విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అపార దేశభక్తుడు, మేధావి అప్పటి కేంద్ర హోం మంత్రి సర్దార్ వల్లభాయి పటేల్ వల్లే ఇదంతా సాధ్యమైందని హైదరాబాద్ విమోచనానికి పటేల్ విశేష కృషి చేశారన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా హైదరాబాద్ సంస్థానానికి కు రాలేదన్నారు. ఆనాటి తెలంగాణ ప్రజలపై నిజాం ప్రభువు , రజాకార్ల ఆగడాల ఫై సాహసోపేతంగా ఆపరేషన్ పోలో ద్వారా పటేల్ పోలీస్ యాక్షన్‌తో నిజాం సైన్యం దిగివచ్చిందన్నారు. ఆనాడు పటేల్ లేకపోతే హైదరాబాద్ విమోచనానికి మరింత సమయం పట్టేదని అమిత్ షా పేర్కొన్నారు. అయితే విమోచన దినాన్ని కొందరు రాజకీయంగా వాడుకోవడం దుర్మార్గమని అమిత్ షా పేర్కొన్నారు. విమోచన దినం జరిపేందుకు ఇన్నాళ్లు ఏ ప్రభుత్వం సాహసించలేదన్నారు. తెలంగాణను పాలించిన పార్టీలన్నీ ఓటు బ్యాంకు కోసమే, అవకాశవాద రాజకీయాలు చేశాయన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నందుకు గర్వముగా ఉందన్నారు. సీఎం కెసిఆర్ నుద్దేశించి పరోక్షంగా ఇప్పటివరకు అధికారంలో ఉన్న వారు విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ఎందుకు నిర్వహించలేదని అమిత్ షా ప్రశ్నించారు.
