సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంఏర్పడ్డాక తొలిసారి కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని 64 సీట్లు గెలుచుకొని మ్యాజిక్ ఫిగర్ ను దాటి అదనంగా 4 సీట్ల గెలుపుతో కైవసం చేసుకొంటుంది.. ఏపీ ని వదులుకొని తెలంగాణను సోనియా గాంధీ ఇచ్చారనే పేరు ఉన్నప్పటికీ దాదాపు 10 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న హస్తం పార్టీ తొలిసారి రాష్ట్రంలో పాలనను చేపట్టబోతుంది. రేపు సోమవారం రేవంత్ రెడ్డీ సీఎం గా ప్రమాణం చేస్తారని ?కర్ణాటక ఉప ముఖ్యమంత్రి మంత్రి డీకే శివకుమార్ దీనికి కేంద్ర అధిష్టానాన్ని వేగంగా ఒప్పించినట్లు హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుందని ప్రచారం జరుగుతుంది. ఈ ఎన్నికలలో ఇప్పటికి వరకు అధికారం చెలాయించిన బి ఆర్ ఎస్ పార్టీ కేవలం 39స్థానాలకు , బీజేపీ 9 స్థానాలకు మజిలిస్ 7 స్థానాలలో గెలుపు ( ఇంకా కొన్ని చోట్ల కౌంటింగ్ కొనసాగుతుంది) సాధిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ జనసేన 8 స్థానాలలో పోటీ చేసినప్పటికీ ఎక్కడ .. ఎవరిని ప్రభావితం చెయ్యలేకపోయింది. అన్నిటికన్నా పెద్ద ట్విస్ట్ ఏమిటంటే.. .కామారెడ్డి నియోజకవర్గంలో బరిలో దిగిన సీఎం కెసిఆర్ ను అటు కాంగ్రెస్ సీఎం అభ్యర్థి గా భావిస్తున్న రేవంత్ రెడ్డి ని కూడా స్థానిక ‘బీజేపీ అభ్యర్థి వెంకట రమణ రెడ్డి‘ ఒక్క దెబ్బకు ఇద్దరు పెద్దలు… అన్న రీతిలో ఓడించడం పెద్ద షాకింగ్ న్యూస్ అని చెప్పాలి.. ప్రజాస్వామ్యంలో ఎంతటి పోటుగాడైనా ఓటర్ తలచుకొంటే..
