సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మొన్నటి వరకు కాస్త దోబుతూచులాడిన టాలీవుడ్ బడాహీరోలు ఇటీవల తేరుకొని .. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఇటీవల వరుసగా కలుస్తున్నారు. సీఎం అయ్యాక టాలీవుడ్ నుండి ముందుగా మెగాస్టార్ చిరంజీవి వెళ్లి కలిశారు. జూబ్లీహిల్స్ లోని రేవంత్ నివాస గృహం లో కలిసిన చిరంజీవి ఆయనకు అభినందనలు తెలిపారు. ఇక ఆ తరువాత నేడు శనివారం ఉదయం సీఎం రేవంత్‌రెడ్డిని కింగ్ నాగార్జున తన భార్య అమలతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక ఇప్పు డు తాజాగా, సినీ లయన్ , టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన చిన్న అల్లుడితో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని సచివాలయంలో కలిశారు. ముఖ్య మంత్రికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంతకీ సీఎం రేవంత్ రెడ్డి అభిమాన హీరో స్వర్గీయ ఎన్టీఆర్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. ఆయన అభిమాన నటుడు స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ.. ఆయన సాహసం, ఆయన సినిమాల ప్రభావం తనపై ముద్ర వేసిందని ఆయనే స్వయంగా చెప్పారు. అంటే మహేష్ బాబు వస్తే రేవంత్ రెడ్డి మరింత ఆనందిస్తారు అన్న మాట..
