సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణ నూతన ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి నేడు, గురువారం మధాహ్నం ఎల్బీస్టేడియంలో ప్రమాణస్వీకార మహోత్సవం వైభవంగా జరిగింది. రేవంత్‌తో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క ప్రమాణస్వీకారం చేసారు. అనంతరం ముఖ్యమంత్రిగా రేవంత్ తొలిసారి ప్రసంగించారు.‘ ప్రజా పోరాటాలతో, అమరవీరుల త్యాగాల పునాది మీద తెలంగాణ ఏర్పడింది. తెలంగాణ సమగ్రాభివృద్ధే కాంగ్రెస్ లక్ష్యం. ప్రజా ప్రభుత్వం ఏర్పాటులో కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు. అమరవీరుల ఆకాంక్షను నెరవేరుస్తాం. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు చేస్తాం. ప్రగతిభవన్ చుట్టూ ఉన్న ఇనుప కంచెను బద్దలు కొట్టాం. ప్రగతిభవన్‌కు ఇక అందరూ వెళ్లొచ్చు. తెలంగాణ ప్రజలు తన మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెడతా. రేపు ఉదయం 10 గంటలకు ప్రజాభవన్‌లో ప్రజా దర్బార్ నిర్వహిస్తాం. మేము పాలకులం కాదు.. ప్రజా సేవకులం.. అంటూ సీఎం రేవంత్ ప్రసంగం ముగిసిన తర్వాత రెండు ప్రభుత్వ దస్త్రాలపై సంతకం చేశారు. మొదటి సంతకం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుపై చేయగా.. దివ్యాంగురాలు రజిని ఉద్యోగ నియామక పత్రంపై సీఎం రేవంత్ రెండో సంతకం చేశారు.
