సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: కనుమరుగవుతున్న తెలుగు బాషా సొగసుకు ఇప్పటికి కవులు ,సాహితీవేత్తలు జీవం పోస్తున్నారని భీమవరం పట్టణానికి చెందిన కవి,రచయిత, పాత్రికేయులు గండి సుధాకర్ అన్నారు. ఆయన రాసిన” సంధ్యా కాంతులు” అనే నానీలు పుస్తకాన్ని మంగళవారం విద్య శాఖ అధికారి ఆర్. వి. రమణ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు కవులు పాల్గొని ఆయన రాసిన సంధ్యాకాంతులు నానీలపై పై తమ విశ్లేషణ తెలిపారు. ఆధునిక సమాజంలో పెరుగుతున్న అవసరాల దృష్ట్యా మాధ్యమాలు సెల్ ఫోన్ ,ఫేస్ బుక్ లలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు పూర్తిగా సమయాన్ని గడిపేస్తూ పూర్తిగా తెలుగును విస్మరిస్తున్నారని, ఈ దశ పూర్తిగా క్షీణించక ముందే తెలుగు కవులను తెలుగు సాహితివేత్తలను గౌరవించి, తెలుగు భాషకు పూర్వవైభవం తీసుకురావాలని,సభలో మాట్లాడిన వక్తలు ఆకాంక్షించారు. దాయిని చంద్రాజీ సభాధ్యక్షులుగా జరిగిన ఈ కార్యక్రమానికి సర్వోదయ మండలి జిల్లా కార్యదర్శి ఇందుకూరి ప్రసాదరాజు, చవటపల్లి సాయి వెంకన్న బాబు, ప్రముఖ అడ్వకేట్ మరియు కవి పుచ్చకాయల బ్రహ్మాజీ రావు, పనసకర్ల ప్రసాద్ తదితరులు పుస్తకం పై సభలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.
