సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలోని కడప లో తెలుగుదేశం పార్టీ (TDP) నిర్వహించే పసుపు పండుగ ‘మహానాడు’ మంగళవారం ఉదయం ‘మా తెలుగు తల్లికి గీతాలాపనతో ఘనంగా సభలు ప్రారంభమయ్యాయి.టీడీపీ కీలక నేతలు అందరు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. తెలుగుదేశం మహా పండుగ ‘మహానాడు’ సందర్భంగా కార్యకర్తలు, నాయకులు, అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తుంగ తరంగంలా ఎగసిపడే ఉత్సాహం తెలుగుదేశం కార్యకర్తల సొంతమని, ఉరకలేసే యువత తెలుగుదేశం ఆస్తి అని వ్యాఖ్యానించారు. తరతరాల తెలుగు ఖ్యాతిని జగద్విదితం చేయడం, ప్రపంచ దేశాల్లో తెలుగు వారు ఎక్కడ ఉన్నా ఆ దేశానికే తలమానికంగా మారాలనేది మన సంకల్పమని, అందుకే మనం నిరంతరం శ్రమిస్తున్నామని .. తెలుగుదేశం ఎదుర్కొన్న పరీక్షల్లో ప్రతిసారీ విజేతగానే నిలిచిందన్నారు. గడచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విశ్వరూప సందర్శనం చరిత్రలో నిలిచిపోతుందని.. మహానాడును తొలిసారి కడపలో నిర్వహించ తలపెట్టామని అన్నారు, ‘కార్యకర్తే అధినేత’గా మారాలనే నూతన మార్గదర్శకాలతో…. ఇనుమడించిన ఉత్సాహంతో మనం ముందుకు సాగాలి…. అదే నా ఆశ… ఆకాంక్ష.. అంటూ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
