సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగువారికి సుపరిచితమైన ఆ చక్కటి స్వరం ఇక మూగబోయింది. దూరదర్శన్ లో సుమారు 4 దశాబ్దాలు రాణించిన ప్రముఖ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ నేడు, శుక్రవారం కన్నుమూశారు. రెండురోజుల క్రితం ఆయనకు గుండెపోటు వచ్చింది. దాంతో కుటుంబ సభ్యులు ఆయన్ను హైదరాబాద్ యశోదా ఆస్పత్రిలో చేర్పించారు. దురదృష్టావశాత్తు చికిత్స పొందుతూనే ఆయన కన్నుమూశారు. శాంతి స్వరూప్ తెలుగులో దూరదర్శన్ లో తొలిసారి వార్తలు చదివారు. తెలుగు తొలి న్యూస్‌ రీడర్‌గా చెరగని ముద్ర వేశారు. అంతేకాదు.. పదేళ్లపాటు టెలీప్రాంప్టర్‌ లేకుండా పేపర్‌ చూసి వార్తలు చెప్పేవారు. శాంతిస్వరూప్.. 1983 నవంబర్ నుంచి దూరదర్శన్‌లో వార్తలు చదివారు. 2011 వరకు దూరదర్శన్‌లో పని చేసిన ఆయన.. ఆ తరువాత పదవీ విరమణ చేశారు. న్యూస్ రీడర్‌గా లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డును కూడా శాంతిస్వరూప్ అందుకున్నారు. ప్రేక్షకులకు దగ్గరగా ఉండాలని కాంక్షతో ఇటీవల పలు యూట్యూబ్ ఛానెల్స్ లో ఆయన వరుసగా ఇంటర్యూలు ఇస్తున్నారు. యువ యాంకర్స్ ను ప్రోత్సహించేవారు. కొత్త తరానికి కూడా నడవడిక ఆదర్శం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *