సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: తెలుగు సినీ పరిశ్రమ తో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మాజీ కేంద్ర మంత్రి, కాకినాడ, నరసాపురం స్థానాలకు ఎంపీగా పనిచేసిన, సీనియర్ హీరో రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు(83) కన్నుమూశారు. నేటి, ఆదివారం తెల్లవారుజామున 3.25 గంటలకు కృష్ణంరాజు తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణంరాజు హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రి లో చికిత్సపొందుతూ కృష్ణంరాజు కన్నుమూరు. 1940 జనవరి 20న ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో కృష్ణంరాజు జన్మించారు. కృష్ణంరాజుకు భార్య శ్యామలా దేవి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆయన ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేసినప్పుడు భీమవరం పట్టణంలోని జేపీ రోడ్డులో బిల్డింగ్ లో నివాసం ఉండేవారు. భీమవరం లో దాదాపు అన్ని వీధులలో ప్రజలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. భీమవరంలో కేంద్ర నిధులతో పాటు తన ఎంపీ నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ రోడ్డు, చేపల బజారు, యనమదురు ఫై విశాలమైన చిన్నవంతెన నిర్మాణం ఆయన కృషి ఫలితమే. భీమవరం మునిసిపల్ కౌన్సిల్ సమావేశాలకు ఎక్స్ ఓపిషియో మెంబెర్ గా హాజరు అయ్యి పలుసార్లు ఓటింగ్లో కూడా పాల్గొనేవారు. కాంగ్రెస్ , బీజేపీ పార్టీలలో సుదీర్ఘకాలం పనిచేసారు. తన సోదరుని కుమారుడు , హీరో ప్రభాస్ కూడా భీమవరంలోనే DNR ప్రాధమిక విద్యాబ్యాసం పూర్తీ చేసారు. కృష్ణంరాజు 1966లో ‘చిలకా గోరింక’ చిత్రంతో తెలుగు సినీ రంగ ప్రవేశం చేశారు. 187కు పైగా చిత్రాల్లో రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు నటించారు. 1983.. బొబ్బిలి బ్రహ్మన్న సినిమా ఇండస్ట్రీ హిట్రువాత తెలుగులో సినిమాకు 25 లక్షల పారితోషికం తీసుకొన్న తోలి హీరోగా టాప్ 1 స్థానంలో నిలిచారు. కృష్ణంరాజు 1977,1984లో నంది అవార్డులు గెలుచుకున్నారు.కటకటాల రుద్రయ్య, రంగూన్ రౌడీ, బావ బావమరిది, మా నాన్నకు పెళ్లి, వంటి సూపర్ హిట్ చిత్రాలు ఆయనకు ఉన్నాయి. 1986లో ‘తాండ్రపాపారాయుడు’ చిత్రానికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డును అందుకున్నారు.ఆయనకు కన్నడ సినిమాలో కూడా మంచి క్రేజ్ ఉండేది.ఇటీవల రాదే శ్యామ్ లో నటించారు. మన సిగ్మా న్యూస్ ఛానెల్ తో కూడా భీమవరంలో మంచి అనుబంధం నడిపిన మంచి వ్యక్తి కృష్ణంరాజు గారి మృతికి వారి కుటుంబ సబ్యులకు తీవ్ర సంతాపం తెలియజేస్తున్నాము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *