సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నేడు, బుధవారం ఘనంగా ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్,భారతి దంపతులు, సంప్రదాయ వస్త్రధారణ లో హాజరయ్యారు, బాలబాలికల ప్రదర్శనలు , వీక్షించారు. మంత్రులు రోజా, కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హాజరయ్యారు. పురోహితుల అస్సిసులతో ఉగాది పచ్చడి తీసుకోని పంచాంగ శ్రవణం అనంతరం సీఎం దంపతులు అందరికీ శోభాకృత ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
