సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు దేశం పార్టీ రాష్ట్ర కోశాధికారి, పార్టీ ఆవిర్భావం నుండి 40 ఏళ్లుగా పార్టీలోనే కొనసాగుతున్న సీనియర్ నేత, మెంటే పార్ధ సారధి కి భీమవరంలో స్థానిక ఆయన నివాసగృహం వద్ద టీడీపీ స్థానిక, జిల్లా స్థాయి నేతలు స్వయంగా వచ్చి శుభాకాంక్షలు తెలియజెయ్యడం జరిగింది. సుదీర్ఘ కాలంగా పార్టీకి ఆయన చేస్తున్న సేవలను అభినందించడం తో పాటు ప్రజా సేవలో నిండు నూరేళ్లు ఆరోగ్యంతో జీవించాలని కోరుకొంటూ.. ఆయనతో కేకు కట్ చేయించి , పుష్ప మాలలతో, బొకేలతో ఆయనను అభినందించడం జరిగింది. నాయి వారి వీధిలోని ఆయన నివాస గృహం నేతలతో కార్యకర్తలతో, రాజకీయాలకు అతీతంగా ఆయన శ్రేయోభిలాషులతో సందడిగా ఉంది.
